Wednesday, January 7, 2009

రావిశాస్త్రిరచనలు- ప్రచురణలు

రాచకొండ విశ్వనాథశాస్త్రి 1938 లో రచనలు ప్రారంభించి 1993 వరకు చేసిన రచనలు వివిధ దిన,వార,మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. కొన్ని కథాసంపుటులుగా వెలువడ్డాయి. కానీ చాలా సంపుటాలు పునఃప్రచురణ లేకపోవడం వలన తెలుగు పాఠకులకు అందుబాటులోలేవు. రావిశాస్త్రి గారి స్నేహితులు,అభిమానులు రావిశాస్త్రిగారి రచనలను ఒకచోట సేకరించి ప్రచురించే ప్రయత్నం చేసారు. 1994లో రావిశాస్త్రిగారి సోదరుడు రాచకొండ నరసింహశర్మగారు ఆర్థిక సహకారం అందించగా రావిశాస్త్రిగారి కుమారులు లక్ష్మీనారాయణ ప్రసాద్, ఉమా కుమార శాస్త్రి రాచకొండ ప్రచురణలు పేరున రావిశాస్త్రిగారి రచనలను ప్రచురించారు. ఇవి తొమ్మిది సంపుటాలలో ఉన్నాయి.


సంపుటి 1.
రాజు-మహిషి
( అసంపూర్తి నవల)
సంపుటి 2.
నాటకాలు-నాటికలు
నిజం, తిరస్కృతి , విషాదం
సంపుటి 3.
నాలుగార్లు
1. ఆరు సారాకథలు
2.ఆరు సారో కథలు
3.ఆరు చిత్రాలు
4.మరో ఆరు చిత్రాలు
సంపుటి 4.
ఋక్కులు
సంపుటి 5
బాకీ కథలు
సంపుటి 6
రావిశాస్త్రీయం
రావిశాస్త్రి వ్యాసాలు,డైరీలు,ఇతర రచనలు
సంపుటి 7
అల్పజీవి నవల
సంపుటి 8
మూడు నవలలు
మూడు కథల బంగారం
సొమ్మలు పోనాయండి
ఇల్లు
సంపుటి 9
రత్తాలు-రాంబాబు నవల
(అసంపూర్తి రచన -నాలుగు భాగాలు కలిపి)
1994 లో ప్రారంభించి 2004 డిసెంబరు వరకు కొంత కాల విరామంతో ప్రచురించబడిన ఈ రచనలు ప్రస్తుతం ఎన్ని తెలుగు పాఠకులకు అందుబాటులో ఉన్నాయో అనుమానమే.
ఆ మధ్య రాచకొండ విశ్వనాథశాస్త్రి సాహిత్యాభిమానులు ఆయన రచనలన్నీ రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనా సాగరం
అనే పేరుతో( మనసు ఫౌండేషన్ ) ఒకే సంపుటిగా వెలువరించారు, జులై 30,రావిశాస్త్రిగారి జన్మదినం సందర్భంగా.
సుమారు 1300నుంచి 1400 పేజీలతో డెమ్మీ సైజు లో ప్రచురించబడిన ఈ పుస్తకం కోసం ప్రయత్నం చేసినా దొరకలేదు.
అదృష్టవంతులెవరికైనా అవకాశం ఉంటే దీనిని స్వంతం చేసుకొని మళ్ళీ మళ్ళీ కావలసినన్ని సార్లు , నచ్చిన రచనలన్నీ చదువుకోవచ్చు-ఎంచక్కా.

1 comment:

కమనీయం said...

రావిశాస్త్రిగారు ' గోవులొస్తున్నాయి జాగ్రత్త 'అనే నవల కూడా రాసారు.అది సీరియల్ గా ఒక పత్రికలో వచ్చింది.వేరే పుస్తక రూపంలో ప్రచురించబడిందో లేదో తెలియదు.కథాంశం ఫ్యూడల్ దౌర్జన్యం/

Related Posts with Thumbnails