Wednesday, January 7, 2009

కథలు -ఏపేరుతో, ఎక్కడ

రావిశాస్త్రి 1950నుంచి 1990 మధ్య రాసి ప్రచురించిన కథలు వేరువేరు పేర్లతో ప్రచురించబడ్డాయి.చాలా మందికి ఈ విషయం తెలుసు.
రావిశాస్త్రి మారుపేరుతో రాసిన కథలు ఏవి,అసలు పేరుతో వ్రాసిన కథలు ఏవి అని తెలుసుకోగోరే పాఠకులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది.
శంకరగిరి గిరిజా శంకరం
అన్ జానా,
జాస్మిన్,
గోల్కొండ రాం ప్రసాద్
ఇవి రావిశాస్త్రి మారుపేర్లు.
శంకర గిరి గిరజా శంకరం పేరుతో 25-10-1968 న ఆంధ్రజ్యోతి వార పత్రికలో జాతక కథ రాశారు.
అన్ జానా పేరుతో 17-4-1970 న ఆంధ్రజ్యోతి వార పత్రికలో ద్వైతాద్వైతం రాశారు.
29-5-1970 న ఆంధ్రజ్యోతి వార పత్రిక లో రవ్వ రాశారు.
మెరుపు మెరిసింది కథ జాస్మిన్ పేరుతో రాశారు.
గోల్కొండ రాం ప్రసాద్ పేరుతో మే,1964 లో యువ మాస పత్రిక లో ఓ మంచివాడి కథ రాశారు.
(ఈ వివరాలకు ఆధారం రచన మాసపత్రిక (ఆగస్టు,2007) ).

No comments:

Related Posts with Thumbnails